Pushpa Sreevani: ఆదర్శంగా నిలుస్తున్న మాజీమంత్రి పుష్పశ్రీవాణి

Pushpa Sreevani: సేంద్రీయ వ్యవసాయంపై మక్కువతో ఇంటి పెరటిలో పంట సాగు

Update: 2022-04-19 07:03 GMT

Pushpa Sreevani: ఆదర్శంగా నిలుస్తున్న మాజీమంత్రి పుష్పశ్రీవాణి

Pushpa Sreevani: సేంద్రీయ వ్యవసాయంపై మక్కువతో తన ఇంటి పెరటిలో కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మాజీమంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి(Pamula Pushpa Sreevani). మినిస్టర్ గా ఉన్న సమయంలో ఖాళీ సమయాల్లో తన పెరటిలో వ్యవసాయాన్ని చేసేవారు పుష్పశ్రీవాణి. అయితే తాజాగా మంత్రి పదవి లేకపోవడంతో వ్యవసాయానికి అధిక సమయం కేటాయిస్తున్నారు.

రసాయనాలు వాడకుండా సేంద్రీయ పద్దతిలో పంటలు సాగుచేసి తన ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటూనే తన వెంట ఉన్నవారికి కూడా కూరగాయలను అందిస్తున్నారు పుష్పశ్రీవాణి. అయితే పుష్పశ్రీవాణి వలే ప్రతీ నేత ఇలా తమ ఇంటి పరిసరాలలో కొద్ది మొత్తంతోనైనా సేంద్రీయ వ్యవసాయం చేస్తే వారిని చూసి మరింత మంది సేంద్రీయ వ్యవసాయం(Organic Farming) వైపు మరలే అవకాశం ఉంటుంది కనుక మిగతా నేతలు కూడా పుష్పశ్రీవాణి వలే సేంద్రీయ వ్యవసాయం చేసి పదిమందిని సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళేలా చేస్తారని కోరుకుందాం.

Full View


Tags:    

Similar News