AP News: ఏపీలో మొత్తం ఓటర్లు 4,02,21,450
AP News: పురుష ఓటర్ల సంఖ్య 1,98,31,791
AP News: ఏపీలో మొత్తం ఓటర్లు 4,02,21,450
AP News: ఏపీలో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ముసాయిదా జాబితాను ఎస్.ఈ.సీ ముఖేశ్ కుమార్ మీనా రిలీజ్ చేశారు. ఓటర్ల లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో ఉంచారు. రాష్ట్రంలో మొత్తం 4కోట్ల 2లక్షల 21వేల 450 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు 2కోట్ల 3లక్షల 85వేల 851, పురుష ఓటర్ల సంఖ్య 1కోటి 98లక్షల 31వేల 791గా ఉంది. సర్వీసు ఓటర్లు 68వేల 158 మంది ఉన్నారు. ముసాయిదా జాబితాలోని అభ్యంతరాలను డిసెంబర్ 9 వరకు స్వీకరిస్తామని ఈసీ పేర్కొంది. 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా వెల్లడిస్తామని తెలిపింది. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా అధికారులకు ఈసీ సూచించింది.