Andhra News: కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నాం: సీఎస్ జవహర్‌రెడ్డి
ఇప్పటికే పలు అంశాలపై కేంద్రంతో చర్చలు జరిపాం: సీఎస్
Andhra News: కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నాం: సీఎస్ జవహర్‌రెడ్డి
Andhra News: తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశం కోర్టు పరిధిలో ఉందని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోడీని సీఎం జగన్ అనేకసార్లు కోరినట్లు చెప్పారు. ఇప్పటికే పలు అంశాలపై కేంద్రంతో చర్చలు జరిపామన్నారు. మరోసారి కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు వెల్లడించారు. రెవెన్యూలోటుతోపాటు పలు అంశాలను చర్చిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనకు రావాలని సీఎంను కూడా కోరినట్లు జవహర్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగత పర్యటనల వాయిదాకు సీఎం అంగీకరించారని పేర్కొన్నారు. తామంతా రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నామని.. అవసరమైతే సీఎం జగన్ కూడా ఢిల్లీకి వస్తారని తెలిపారు.