ప్రజలను సంతోష పెట్టేలా కార్యక్రమాలు ఉండాలి : సీఎం జగన్

Update: 2019-07-16 08:38 GMT

స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జులై 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు వచ్చిన వినతి పత్రాలు, వాటి పరిష్కారాన్ని జిల్లాకలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించిన సీఎం పలు అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలను ప్రశ్నించారు. మొత్తం 45వేల 496 వినతులు అందాయని జగన్‌కు వివరించిన అధికారులు ఆర్థిక అంశాలకు సంబంధంలేని అంశాలపై 1904 వచ్చినట్లు తెలిపారు. పరిష్కరించాల్సిన సమస్యలు ఒక వేయి 116 సమస్యలు ఇంకా పరిష్కరించాలన్నారు.

సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే రానురాను అవి పేరుకుపోతాయని సీఎం జగన్ అన్నారు. మన దృష్టి, ఫోకస్ తగ్గితే విశ్వసనీయత తగ్గిపోతుందని కలెక్టర్లతో జగన్ పేర్కొన్నారు. ప్రజలను సంతోష పెట్టేలా కార్యక్రమాలు ఉండాలన్నారు. అవినీతిని తాను సహించబోనని జగన్ మరోసారి స్పష్టం చేశారు. అవినీతికి దూరంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. లంచం లేకుండా పనులు జరుగుతున్నాయని ప్రజలు విశ్వాసం పొందేలా పనులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News