సెప్టెంబర్ 1 నుంచి 3వరకు ఏపీ సీఎం జగన్ కడప జిల్లా పర్యటన
CM Jagan: వైఎస్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
సెప్టెంబర్ 1 నుంచి 3వరకు ఏపీ సీఎం జగన్ కడప జిల్లా పర్యటన
CM Jagan: కడప జిల్లాలో ఎపీ సీఎం జగన్ మూడు రోజుల పర్యటన ఖరారైంది. సీఎం జగన్ సొంత జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటనలోనే ఇడుపులపాయలో జరిగే దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో వేముల మండలం వేల్పుల సచివాలయం కాంప్లెక్స్‌ను జగన్ ప్రారంభిస్తారు. ఎస్టేట్‌లోని ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై జగన్ సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం వరకు సమీక్షా సమావేశాల అనంతరం ఎస్టేట్‌లోని వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు. సెప్టెంబర్ 3న ఇడుపులపాయ నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.