చనిపోయినా నా ఫొటోలు ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నా : ఏపీ సీఎం జగన్

Update: 2019-06-24 10:01 GMT

చనిపోయినా నా ఫొటోలు ప్రతి ఇంట్లో ఉండాలని నేను తాపత్రయ పడుతున్నాను. అలాగే మీ గురించి కూడా ప్రజలు మాట్లాడుకోవాలి అని కలెక్టర్ లను ఉద్దేశించి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు అమరావతిలో జగన్ అధ్యక్షతన కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాలనలోని పలు అంశాలపై కూలంకషంగా సీఎం కలెక్టర్లకు వివరిస్తున్నారు. ముఖ్యంగా నవరత్నాలు పథకం లోని అంశాలు.. మేనిఫెస్టో లోని అంశాలపై ఏవిధంగా ముందుకు పోవాలని అనుకుంటున్నారో వివరిస్తున్నారు.

ఈ సందర్భంగా మేనిఫెస్టో అంశాలపై సీఎం జగన్ మాట్లాడుతూ.. ''మేనిఫెస్టోపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. నాకు సన్నిహితులైన కొంతమంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో డిస్కస్‌ చేశాను. వారికి ఏంచెప్తే బాగుంటుందని అడిగా. ఇవి చేయగలిగితే.. మనం మార్పులు సాధించగలం అని సూచించారు. చనిపోయినా నా ఫొటోలు ప్రతి ఇంట్లో ఉండాలని నేను తాపత్రయ పడుతున్నా,అలాగే మీ గురించి ప్రజలు మాట్లాడుకోవాలి. కొన్ని సలహాలు నేను మీకు ఇస్తాను, మీరు మీకున్న పరిజ్ఞానంతో వాటిని మెరుగు పరచవచ్చు. పాదర్శకత, స్నేహపూర్వక పరిపాలన ఉండాలి. ఉదయం నుంచి, సాయంత్రం వరకూ మీరు నవ్వుతూ ఉండాలి. అది మీకు సహాయపడుతుంది. మీ దగ్గరకు ఎవరైనా వస్తే.... వారిని ఆప్యాయంగా పలకరించండి. నవరత్నాలు – మేనిఫెస్టో.. ప్రతి అర్హత ఉన్నకుటుంబానికి చేరాలి. మన పార్టీ, వేరొక పార్టీ,, వీటిని పట్టించుకోవద్దు.నాకు ఓటేశాడు, వేయలేదు.. వీటిని పట్టించుకోవద్దు. '' అంటూ దశా నిర్దేశం చేశారు.  

Tags:    

Similar News