ఢిల్లీ పర్యటనలో జగన్ బిజీబిజీ.. కేంద్ర పెద్దలను కలుస్తూ. ఏపీ సమస్యలపై విజ్ఞప్తులు

Update: 2019-06-14 15:07 GMT

ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన మొదటి రోజు నుంచే సంచలన నిర్ణయాలతో దూకుడు ప్రదర్శిస్తోన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధనతోపాటు విభజన హామీలపై దృష్టిపెట్టారు. నీతి ఆయోగ్ మీటింగ్‌ కోసం ఢిల్లీ వెళ్లిన వైఎస్ జగన్‌ కేంద్ర పెద్దలను కలుస్తూ, ఏపీకి స్పెషల్‌ స్టేటస్ ఇవ్వాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి విభజన సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టిపెట్టారు. నీతి ఆయోగ్ మీటింగ్‌ కోసం ఢిల్లీ వెళ్లిన వైఎస్ జగన్‌ కేంద్ర పెద్దలను కలుస్తూ, ఏపీ సమస్యలపై వినతిపత్రాలు ఇస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశమైన జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలను నెరవేర్చాలని మెమొరాండం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యమైన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విభజన కష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రిని కోరినట్లు తెలిపారు. ముఖ్యంగా ఏపీకి హోదా ఇచ్చేలా ప్రధాని మోడీని ఒప్పించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశామన్నారు. ఇక నీతి ఆయోగ్ మీటింగ్‌లోనూ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తానన్న సీఎం జగన్‌ దేవుడి దయంతో స్పెషల్ స్టేటస్‌‌ను సాధించడానికి ప్రయత్నిస్తానన్నారు.

ఇక లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై ఊహాగానాలు వద్దన్న జగన్మోహన్‌రెడ్డి ఆ పోస్ట్‌ను తాము కోరలేదని వాళ్లు ఇస్తామనలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రత్యేక ప్యాకేజీపై గత ప్రభుత్వ తీర్మానానికి అనుగుణంగా, కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సహకరిస్తామన్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన మొదటి రోజు నుంచే సంచలన నిర్ణయాలతో దూకుడు ప్రదర్శిస్తోన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధనతోపాటు విభజన హామీల అమలు కోసం కూడా సీరియస్‌గానే ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News