Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు

Vijayasai Reddy: మాజీ ఎంపీ విజసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.

Update: 2025-03-11 02:56 GMT

Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు

Vijayasai Reddy: మాజీ ఎంపీ విజసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌, కాకినాడ సెజ్‌ల్లో 3,600 కోట్ల విలువైన వాటాలను బదిలీకి సంబంధించి కేసులో ఏపీ సీఐడి... విజయసాయిరెడ్డిని కూడా నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ‎

ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. విజయసాయిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణికి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. రేపు ఉదయం విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News