Andhra Pradesh: ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే కేబినెట్ భేటి, కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం, హైపవర్ కమిటీ నివేదికపై సమావేశంలో చర్చించే అవకాశం.

Update: 2020-01-18 01:49 GMT
ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి

ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన జరగాల్సిన మంత్రివర్గ భేటీ సోమవారం నాటికి వాయిదా వేశారు. మొదట సోమవారం రోజునే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఈరోజే నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత మరోసారి వాయిదా వేసింది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే కేబినెట్ భేటి నిర్వహించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

అదే రోజు హైపవర్ కమిటీ నివేదికను సీఎం జగన్ కు అంద చేయనున్నది.ఈ నివేదికపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత వికేంద్రీకరణ, మూడు రాజధానులపై ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. ఈనెల 20న జరిగే అసెంబ్లీ సమావేశంలో పరిపాలన వికేంద్రీకరణ, రాజధానుల అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే బిల్లు బాస్ చేయించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.  

Tags:    

Similar News