కొలువుదీరనున్న 15వ అసెంబ్లీ

Update: 2019-06-11 11:49 GMT

రేపట్నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 11గంటల 5 నిమిషాలకు 15వ అసెంబ్లీ కొలువదీరనుంది. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు స్వాగతం, ప్రొటెం స్పీకర్‌కు అభినందనలు తెలపనున్నారు. ఆ తర్వాతి రోజు అంటే 13న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం ఉండనుంది. అలాగే 13నే స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక 14న ఉభయ సభల సంయుక్త సమావేశం జరగనుండగా, అదే రోజు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఇక 14నుంచే శానసమండలి సమావేశాలు జరగనున్నాయి.

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్వసాధారణంగా నిర్వహించే తొలి సమావేశాలు రేపట్నుంచి జరగనున్నాయి. కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ వెంకట చినప్పలనాయుడు ప్రమాణం చేయించనున్నారు. మొదట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆ తర్వాత టీడీఎల్పీ నేత చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. 13న స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. తర్వాతి రోజు అంటే 14న సమావేశంకానున్న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నర్సింహన్ ప్రసంగించనున్నారు.

రేపపట్నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. మొదటి కేబినెట్‌ సమావేశంలోనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాశమంత ఎత్తుకి ఎదిగారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోను అమలు చేసే విధంగా తొలి క్యాబినెట్ సమావేశంలోనే చర్యలు తీసుకోవడం గర్వకారణన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత స్పీకర్, ప్రభుత్వంలా కాకుండా హుందాగా నిర్వహిస్తామన్నారు. ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు ఛాంబర్ కూడా ఇవ్వకుండా హేళన చేశారని, తమ ప్రభుత్వంలో అందరికీ సరైన ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. 

Tags:    

Similar News