ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Update: 2019-07-11 03:43 GMT

 ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 9గంటలకు ప్రారంభమైన వెంటనే ఏపీ స్పీకర్ తమ్మినేని ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. సమావేశంలో కరువు, విత్తనాల కొరత, తమ పార్టీ నేతలపై దాడులకు సంబంధించి చర్చ జరపాలని టీడీపీ కోరింది. దీంతో తొలిరోజే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలు కాబోతోంది. రైతుల సమస్యలపై టీడీపీ సభ్యులు నిలదీయనున్నారు. మరోవైపు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు కూడా రేపు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. ప్రశ్నోత్తరాలు ముగిశాక సభలో సీఎం జగన్ కరువుపై చర్చను ప్రారంభిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన 019-20 వార్షిక బడ్జెట్‌ను, తర్వాత వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో ఈ నెల 15న బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది. 17 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. అదేరోజు ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానమిస్తారు. 

Tags:    

Similar News