Visakhapatnam: ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
Visakhapatnam: ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టార్ కార్యాలయం దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
Visakhapatnam: ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టార్ కార్యాలయం దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు. వర్సిటీ కనీసం వసతులు కల్పించడాలని డిమాండ్ చేస్తూ వీసీ రాజశేఖర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు వీసీ రాజశేఖర్ శాంతియుత చర్చకు రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. తాను ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. తాను వీసీగా ఛార్జ్ తీసుకుని 6 నెలలు మాత్రమే అయ్యిందన్నారు. విద్యార్థులు చర్చలకు రావాలని రాజకీయాలు చేయాలని చూస్తే.. మీ ఇష్టం అంటూ వీసీ సమాధానం ఇచ్చారు. వీసీ వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయిన విద్యార్థులు ఆందోళనకు దిగారు.