చంద్రబాబు ఏపీకి వస్తే 14 రోజులు క్వారంటైన్‌కు వెళ్లాలి

ప్రతిపక్షనేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. హైదరాబాద్‌లో కూర్చుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Update: 2020-04-10 04:50 GMT
Chandrababu naidu (File Photo)

ప్రతిపక్షనేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. హైదరాబాద్‌లో కూర్చుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌, టెలీ కాన్ఫరెన్స్‌ల పేరుతో విమర్శలు చేయడం సరికాదని, కరోనా కట్టడికి తమ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని, ఏదైనా వుంటే ఏపీ వచ్చి మాట్లాడాలని అన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ రావాలంటే ఆయన తెలంగాణ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి తీసుకోవాలని, అనుమతి పత్రంతో ఏపీ వచ్చినా 14 రోజుల పాటు క్వారంటైన్‌కు వెళ్లాలి మోపిదేవి అన్నారు.

ప్రపంచానికి కరోనా సోకితే చంద్రబాబుకు నీచ రాజకీయ వైరస్ సోకిందని, చ‌ంద్ర‌బాబు ప్ర‌తి విష‌యాన్ని రాజ‌కీయం చేస్తున్నారని.. క‌రోనాను వదిలేసి తమ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్. వైరస్‌ నియంత్ర‌ణ కోసం సీఎం జగన్ చ‌ర్య‌లు తీసుకుంటుంటే మాస్కులు, కిట్లు లేవ‌ని నింద‌లు వేస్తున్నార‌ని మండిపడ్డారు.

ఆప‌రేష‌న్ డాక్ట‌ర్ విక‌టించ‌డంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నార‌ని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు హోం క్వారంటైన్‌లో కూర్చుని అసత్యాలు చెబుతున్నారని , లోకేష్, అయ్యన్నపాత్రుడు డైరెక్షన్‌లో డాక్ట‌ర్ సుధాక‌ర్ N95 మాస్కులు లేవంటూ అస‌త్య ప్ర‌చారం చేశారని ఆరోపించారు మండిపడ్డారు మంత్రి కన్నబాబు. 

Tags:    

Similar News