ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85 రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏ మీడియంలో చదువుకోవాలి అనేది విద్యార్థులకు వదలివేసింది.
ప్రభుత్వ నిర్ణయం సవాలు చేస్తూ పిల్ దాఖలు చేసిన న్యాయవాది ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్ లు మిగిలిపోయే ప్రమాదం ఉందన్న న్యాయవాది.. మాతృ భాష త్వరగా అర్థం చేసుకునే అవకాశం ఉందన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది.