AP Capital : అభ్యంతరాల స్వీకరణ మొదలు

Update: 2020-01-16 07:28 GMT
ప్రతీకాత్మక చిత్రం

కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఏపీలో కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ పరుగులు పెడుతుంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వం హైపవర్ కమిటీని కూడా ఏర్పాటు చేసారు. తాజాగా అమరావతి రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరనను ప్రారంభించారు. మెయిల్, ఆన్‌లైన్, నేరుగా సీఆర్డీఏ కార్యాలయంలో సూచనలు, సలహాలు, అభ్యంతరాలను తెలపొచ్చని హైపవర్ కమిటీలో ఉన్న మంత్రులు తెలియజేశారు.

ఈ నెల 17 సాయంత్రం 5 గంటల వరకు రాజధాని ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా చెప్పాలని కోరారు. దాంతో పాటు అభిప్రాయాలను కూడా తెలియజేయొచ్చన్నారు. 29 గ్రామాల రైతుల అభ్యంతరాల స్వీకరణ కోసం తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లను కూడా చేశామన్నారు. రాజధాని రైతులతో పాటు సాధారణ ప్రజలు కూడా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మెయిల్ ద్వారా అభిప్రాయాలను తెలపాలనుకుంటే commissioner@crda.org కి మెయిల్ చేయాలని అధికారులు సూచించారు. ఆన్‌లైన్ ద్వారా తెలియజేయాలనుకుంటే https://crda.ap.gov.in ద్వారా తెలపొచ్చని సూచించారు.




Tags:    

Similar News