Andhra Pradesh: ఏపీలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు

Andhra Pradesh: రైతులకు ఖాళీ గోనే సంచులు పంపిణీ చేయాలని ఆదేశం * రైతుల ముసుగులో దళారుల ధాన్యం విక్రయిస్తే చర్యలు తప్పవు

Update: 2021-05-21 12:25 GMT
వరి పంట కొనుగోలు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: అనంతపురం జిల్లాలో చెరువులు, బోరు బావుల కింద రబీలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాయదుర్గం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన ఖాళీ గోనే సంచులు ఆయా గ్రామాల్లో రైతులకు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రైతుల ముసుగులో దళారులు ఎవరైనా ప్రభుత్వానికి వరి ధాన్యం విక్రయించి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు కాపు రామచంద్రా రెడ్డి చెప్పారు.

Full View


Tags:    

Similar News