ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేదలకు ఊరట

జ‌గ‌న్ స‌ర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత‌ నవంబర్‌ నుంచి పరిష్కారం కాని క్లెయిములు.. వెంటనే చెల్లింపులు చేయాలని ఆయన‌ ఆదేశించారు.

Update: 2020-04-17 14:44 GMT
YSJagan(File Photo)

జ‌గ‌న్ స‌ర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత‌ నవంబర్‌ నుంచి పరిష్కారం కాని క్లెయిములు.. వెంటనే చెల్లింపులు చేయాలని ఆయన‌ ఆదేశించారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ కూలీప‌నులు చేసేవారు, వేత‌నాలు త‌క్క‌వు వచ్చిన వారు ఇలా త‌దిత‌రులు సహజమరణం చెందినా.. లేదా ప్రమాదవశాత్తూ చ‌నిపోతే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు బీమాలు అందించేవి. సహజ మరణం చెందితే ఒక తరహా బీమా, ప్రమాదవశాత్తూ మరణిస్తే మ‌రో బీమా చెల్లించేవి. బీమా, ఎల్‌ఐసీ మంజూరు చేయకున్నా.. ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాను ఇవ్వాల‌ని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు చెల్లింపులు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శ‌నివారం నుంచి చెల్లింపులు చేయాల‌ని అధికారులు ప్ర‌య‌త్నాలు చేశారు.

అయితే 2019 నవంబర్‌ నుంచి ఈ క్లెయిములు నిలిచిపోయాయి. ఈ అంశంపై స్పందించాల‌ని ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించిన ఎల్‌ఐసీకి లేఖరాశారు. అయినా సరే ఇప్పటివరకు క్లెయిమ్‌లను... మంజూరు చేయలేదు. దీంతో క్లెయిమ్‌ల మంజూరు కోర‌డంతోపాటు అవి ఆగిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినా.. వాటా సుమారు రూ. 400 కోట్లు ఇవ్వాలని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణయించింది. ఒకవేళ బీమా సంస్థ.. ఇవ్వాల్సిన‌దాన్ని.. ఇవ్వ‌కుంటే ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించే విధంగా సీఎం నిర్ణ‌యం తీసుకున్నారు.

Tags:    

Similar News