Andhra Pradesh: నేడు ఏపీలో ఆ జిల్లా మొత్తం కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405 చేరింది. శనివారం ఒక్కరోజే కొత్తగా 24 మందికి కరోనా సోకింది.

Update: 2020-04-12 03:47 GMT
Representational Image

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405 చేరింది. శనివారం ఒక్కరోజే కొత్తగా 24 మందికి కరోనా సోకింది. గుంటూరు జిల్లాలో 17, కర్నూలు జిల్లాలో 5, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరుగురు మృత్యువాత పడ్డారు. అందువల్ల ప్రస్తుతం 388 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గుంటూరు జిల్లాలో 74 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ గుంటూరు జిల్లా మొత్తం కర్ఫ్యూ విధిస్తున్నట్టు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రకటించారు. కేవలం వైద్య సంబంధిత విషయాల కోసం కాకుండా, మిగిలిన ఏ పని మీద కూడా బయటకు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

అన్ని కూరగాయలు, నిత్యావసర సరుకుల మార్కెట్లు కూడా మూసి ఉంటాయని చెప్పారు.అలాగే, చికెన్, మటన్ షాపులు కూడా బంద్ చేస్తున్నట్టు చెప్పారు. రోజూ విడిచి రోజు చొప్పున నిత్యావసరాల కోసం బయటకు పంపే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు. ప్రజలు ఎవరు బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. పీడీ యాక్టు అమల్లో వుంటుందని తెలిపారు

Tags:    

Similar News