సీఎం జగన్ సంచలన నిర్ణయం...లక్ష మందికిపైగా రూ. 10 వేల చొప్పున సాయం

ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

Update: 2020-05-03 10:51 GMT
YS Jaganmohan Reddy(File photo)

 ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మార్చి 24న లాక్‌ డౌన్‌ ప్రకటించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో వేటను నిషేధించింది. లాక్ డౌన్ కారణంగా చేపల వేటపై ప్రభుత్వం నిషేధించడంతో మూడు నెలల నుంచి వారంతా వేటకు వెల్లకుండా ఉపాధిని కోల్పోయారు. దీంతో వారంతా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా వారందరినీ ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌‌రెడ్డి మత్స్యకారులకు విరామ భృతి అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి మత్యకారుని కుటుంబానికి రూ.10వేలు వారి ఖాతాలో జమచేయనున్నారు.

ఇందుకు గాను మొత్తం 1.09 లక్షల మంది లబ్దిదారుల పేర్లను, వివరాలను గ్రామ సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ కు చేపల వేటకు వెళ్లి చిక్కుకున్న మత్సకారులు శుక్రవారం రాత్రి నుంచి విశాఖపట్నం చేరుకుంటున్నారు. సుమారుగా 16 వందల మంది మత్స్యకారులు శనివారం వరకు విశాఖకు చేరుకున్నారు.

ఇక అదే విధంగా చేపల వేటకు వెళ్లి తమిళనాడు రాష్ట్రంలోని కాసిమేడ్‌ ప్రాంతంలో చిక్కుకుపోయిన 900 మంది మత్స్యకారులను తమ స్వస్థలాలకు తెప్పించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు.

Tags:    

Similar News