రేషన్ కార్డుల జారీలో మార్పులు చేస్తు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

-గ్రామాల్లో వార్షిక ఆదాయం లక్షా 20 వేలు -పట్టణాల్లో లక్షా 44 వేల రూపాయలు ఉన్న వారు అర్హులు -ఆహార భద్రతా నియమాల్లో ఏపీ ప్రభుత్వం సవరణలు

Update: 2019-12-02 15:06 GMT
ఏపీ ప్రభుత్వం

ఆహార భద్రతా నియమాల్లో ఏపీ ప్రభుత్వం సవరణలు చేసింది. రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో వార్షిక ఆదాయం లక్షా 20 వేలు, పట్టణాల్లో వార్షిక ఆదాయం లక్షా 44 వేల రూపాయలు లోపు ఉన్నవారు అర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం. నాలుగు చక్రాల వాహానాలు ఉన్నవారిని బీపీఎల్ కోటా నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే పారిశుధ్య కార్మికులను బీపీఎల్ కోటా కింద పరిగణించేలా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.  

Tags:    

Similar News