కరోనా పరీక్షల్లో ఏపీకి నాలుగో స్థానం.. ఎన్ని టెస్టులు జరుగుతున్నాయో తెలుసా
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ మహమ్మరి బారిన పడి మరణాల సంఖ్య వేలకు చేరుకుటుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమానితులకు వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం పదిలక్షల మందిలో 331మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఏపీ టాప్ 5లో స్థానం దక్కించుకుంది. ఆ లెక్కల ప్రకారం ప్రతి 10 లక్షల మందికి రాజస్థాన్‌లో 549 నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి, కేరళ 485, మహారాష్ట్ర 446 పరీక్షలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 10 లక్షల మందికి 331గా ఉంది. కేంద్రం లెక్కల ప్రకారం ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత ప్లేస్ లో గుజరాత్ 331 ఏపీ కంటే జనాభా ప్రకారంగా చూస్తే గుజరాత్‌లో ఎక్కువ, తమిళనాడు 324, హరియాణా 302, ఉత్తరాఖండ్ 241, హిమాచల్ ప్రదేశ్ 208, ఛత్తీస్ గఢ్ 201తో ఈ పది రాష్ట్రలు కొనసాగతున్నాయి.
అయితే, తెలంగాణకు సంబంధించిన వివరాలు మాత్రం కేంద్రం విడుదల చేయలేదు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల వివరాలు కూడా విడుదల చేయలేద, తెలంగాణలో 700కు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 14కు చేరింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరింది. మరో 35 మంది బాధితులు డిశార్చ్ అయ్యారు. ప్రస్తుతం 517 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ కర్నూలు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 4, చిత్తూరు 5, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు 6, కడపలో 1, కృష్ణా జిల్లాలో కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో జిలాల వారిగా పాజిటివ్ కేసులు పరిశీలిస్తే గుంటూరు జిల్లాలో అత్యధికంగా 126 కేసులు నమోదయ్యాయి, కర్నూలు (126,), కృష్ణ(52), కడప(37), నెల్లూరు(64), ప్రకాశం(42), పశ్చిమ గోదావరి(34), చిత్తూరు(28), అనంతపూరం(26), విశాఖపట్నం(20), తూర్పు గోదావరి(17) జిల్లాలు ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కోవిడ్ ఫ్రీ జిల్లాలుగా ఉన్నాయి