Palle Raghunatha Reddy Tests Positive for Covid19: టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డికి కరోనా పాజిటివ్..

Palle Raghunatha Reddy Tests Positive for Covidc19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Update: 2020-08-25 01:00 GMT

Palle Raghunadh Reddy (File Photo)

Palle Raghunatha Reddy Tests Positive for Covidc19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. అదే విధంగా మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొంతమంది కోలుకోగా, ఇంకొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాద్ రెడ్డికి కరోనా సోకింది. గత రెండు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న అయన.. కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అనెఇ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పల్లె రఘునాద్ రెడ్డే స్వయంగా వెల్లడించారు. అయితే, మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.

గడిచిన 24 గంటల్లో 8,601 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 54,463 శాంపిల్స్‌ని పరీక్షించగా 8,601 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,741 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో 10 మంది, ప్రకాశంలో 10 మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, విశాఖపట్టణంలో ఏడుగురు, అనంతపూర్‌లో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3,58,817. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,368. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,65,933కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 89,516 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 54,463 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 32,92,501 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం. 


Tags:    

Similar News