ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా

ఒక వైపు కరోనా మహమ్మారి వణికిస్తోంది. మరో వైపు కరోనా పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు షికారు చేస్తున్నాయి.

Update: 2020-04-25 12:08 GMT
DGP gautam sawang

ఒక వైపు కరోనా మహమ్మారి వణికిస్తోంది. మరో వైపు కరోనా పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు షికారు చేస్తున్నాయి.అయితే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరో సారి స్పందించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా బారినపడి మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను బాధితుడి కుటుంబానికి డీజీపీ సవాంగ్ అందజేశారు.

దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే అని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసులకు పీపీఈ కిట్లు కొనుగోలకు ప్రభుత్వం 2.89 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అమూల్యమైన సేవలు అందిస్తున్న వారిని కొనియాడారు. ఏపీలో కాంటాక్ట్ వ్యక్తులను సాధ్యమైనంత త్వరగా గుర్తిస్తున్నామని, రాష్ట్రానికి 28,000 వేల మంది విదేశాల నుంచి ఢిల్లీ జమాత్ నుంచి 1185 మంది వచ్చినట్లు ఆయన తెలిపారు.

వారి అందరినీ గుర్తించి క్వారంటెన్‌లో ఉంచామని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధిక మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అని సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు, పరిశ్రమలకు మినహాయింపులు ఇచ్చామని, అన్ని శాఖలతో పోలీసులు సమన్వయం చేసుకుంటు ముందుకుసాగుతున్నామని వెల్లడించారు. 

Tags:    

Similar News