AP Cabinet Meeting: నేడు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
* 40 అంశాల అజెండాతో జరగనున్న సమావేశం * ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేట్ అథారిటీ ఏర్పాటుపై నిర్ణయం
నేడు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ (ఫోటో: ది హన్స్ ఇండియా)
AP Cabinet Meeting: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. 40 అంశాల అజెండాతో జరగనున్న కేబినెట్ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి. ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేట్ అథారిటీ ఏర్పాటుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఆసరా రెండో విడత మొత్తాన్ని విడుదల చేసే అంశానికి ఆమోదం తెలుపనుంది కేబినెట్. అలాగే మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించనుంది.
గృహలు మంజూరైన లబ్ధిదారులకు రూ.35 వేల అదనపు రుణాన్ని ఇచ్చే ప్రతిపాదనను కూడా కేబినెట్ ప్రస్తావించనుంది. ఈ మీటింగ్‌లో బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం లభించనుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించనున్నారు.