వార్షిక బడ్జెట్‌కు ఏపీ మంత్రివర్గం ఆమోదం

Update: 2020-06-16 04:29 GMT

ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. ఉ.10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం సభ ఎజెండాను రూపొందించేందుకు బీఏసీ సమావేశం కానుంది.

గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ప్రసంగం, బీఏసీ సమావేశం అనంతరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రూ. 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది అంతకంటే ఎక్కువ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సభలో ప్రవేశపెట్టనున్న 8 బిల్లులకూ కేబినెట్ ఆమోద ముద్ర పడింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పాస్‌లు లేనిదే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కార్లకు సైతం అనుమతి నిరాకరిస్తున్నారు. 

 

Tags:    

Similar News