ఉత్కంఠ రేపుతున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు!

ఉత్కంఠ రేపుతున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు!
x
Highlights

కరోనా విజృంభిస్తున్న వేళ వస్తున్న ఏపీ బడ్జెట్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. లాక్ డౌన్ ఇబ్బందులను అధిగమిస్తూ బడ్జెట్ అంచణాలు ఎలా ఉండబోతున్నాయని...

కరోనా విజృంభిస్తున్న వేళ వస్తున్న ఏపీ బడ్జెట్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. లాక్ డౌన్ ఇబ్బందులను అధిగమిస్తూ బడ్జెట్ అంచణాలు ఎలా ఉండబోతున్నాయని ఉత్కంఠను రేపుతోంది. ఏపీ అసెంబ్లీలో మంగళవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 2 లక్షల 50 వేల కోట్లపైనే ఈసారి బడ్జెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థికమంత్రి, అధికారులు బడ్జెట్ కి తుదిరూపు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో ఎలాంటి సంబంధం లేకుండా రూపొందిస్తున్న బడ్జెట్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చుద్దాం.

2020-21 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ 2.50 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశాలున్నాయి. గత ఏడాది ఇది 2 లక్షల 27వేల 5వందల కోట్లు కాగా ఈ ఏడాది అంతకు మించి అంచనాలు రూపొందించినట్లు తెలుస్తోంది. శాసనసభలో జూన్‌ 16న పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు అధికారులు రంగం సిద్ధంచేస్తున్నారు. మార్చి నెలలోనే బడ్జెట్‌కు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ మేరకు అప్పుడే దాదాపు బడ్జెట్ కు తుది రూపునిచ్చారు. అయితే కరోనా సమయంలో అంత ఆదాయ, వ్యయాలు సాధ్యమా అన్నట్లు అనుమానాలు వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం కరోనాతో సంబంధం లేదు అన్నట్లుగా అంచనాలను రూపొందించింది.

తొలి మూడు నెలల కాలానికి బడ్జెట్‌ వినియోగం కోసం ఓటాన్‌ అకౌంట్‌ రూపంలో ఆర్డినెన్సు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల వరకు 3 నెలల కాలపరిమితి పూర్తవ్వడంతో జూలై నుంచి తిరిగి అవసరమైన ఖర్చులకు శాసనసభ ఆమోదం పొందాల్సి ఉంది. దీంతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభలో సమర్పిస్తారు. 9నెలల కాలానికి అవసరమైన పద్దుకు ఉభయసభల ఆమోదం పొందనుంది ఈ బడ్జెట్. ప్రస్తుతం ఓటాన్‌ అకౌంట్‌ ఆర్డినెన్సుకు కూడా ఉభయసభల ఆమోదం పొందాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ 3 నెలల కాలానికి అవసరమైన ఖర్చులకు, ఇతర చెల్లింపులకు బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు ఇచ్చారు.

కరోనా రక్కసి కారణంగా రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గింది. నెలకు సగటున 6వేల కోట్లు రావాల్సిన ఆదాయం రెండు నెలలకు రూ.13వందల కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ పూర్తిస్థాయి ఆదాయానికి సమయం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ఆదాయ అంచనాలు పడిపోయినప్పటికీ బడ్జెట్‌పై ఆ ప్రభావం కనిపించకుండా రూపొందించినట్లు తెలుస్తోంది.

గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాలుగా 15 నుంచి 22 శాతం వరకు బడ్జెట్‌ అంచనాలు పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కిందటేడాది కన్నా 20శాతం ఎక్కువే అంచనాలు ఉండనున్నాయని అధికారుల చెబుతున్నారు. కానీ అది క్షేత్రస్థాయిలో సాధ్యమా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories