మీరు మారాలి బాబూ! శాసనసభలో అంబటి

Update: 2019-06-17 09:17 GMT

మీరు మారాలి.. మీ పార్టీ అధినేత మారాలి.. మీరు మారకపోతే తట్టుకోలేరు. మిమ్మల్ని మీరు సంస్కరించుకోమని మనవి చేస్తున్నానంటూ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ను ఉద్దేశినిచి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో చక్రం తిప్పిన చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడికి కూడా అర్థం కాని విధంగా అనూహ్య విజయాన్ని ప్రజలు వైసీపీకి ఇచ్చారన్నారు. ఐదేళ్ల క్రితం చంద్రబాబు బెల్ట్ షాపులు రద్దు చేస్తామని మొదటి సంతకం చేశారు.. అయితే ఆ సంతకాన్ని ఐదేళ్ల తరువాత వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారు. బెల్టు శాపులనే రద్దు చేయలేని టీడీపీ పాలన ఎలా సాగిందో ప్రజలు చవిచూశారు. అందుకే అఖండ విజయాన్ని మాకిచ్చారని ఎద్దేవా చేశారు. 

Tags:    

Similar News