Ambati Rambabu: శ్రీశైలం నీటిని వాడుకోలేకపోవడానికి కారణం చంద్రబాబే
Ambati Rambabu: ఏపీ సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
Ambati Rambabu: శ్రీశైలం నీటిని వాడుకోలేకపోవడానికి కారణం చంద్రబాబే
Ambati Rambabu: శ్రీశైలం నీటిని వాడుకోలేకపోవడానికి చంద్రబాబే కారణమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా నీటిని వాడుకుంటోందన్నారు. పవర్ ప్రాజెక్టు కోసం నీటిని వాడొద్దని అప్పట్లో చంద్రబాబు చెప్పలేదని, అందుకే చంద్రబాబు రైతు ద్రోహిగా మిగిలిపోయారని అంబటి దుయ్యబట్టారు. నీటి పంపకాల విషయంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.. నాగార్జున సాగర్ గేట్ల తాళాలు తెలంగాణ సర్కార్ వద్ద ఉన్నాయన్నారు.. తెలుగు రాష్ట్రాల నీటి పంపకంలో తాము రాజీపడబోమని, ఏపీ సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అంబటి తేల్చి చెప్పారు.