అమరావతిపై ముఖ్యమంత్రికి సంచలన ప్రతిపాదనలు?

Update: 2020-01-02 03:25 GMT

ప్రస్తుతం అమరావతిలోని రాజధాని రైతులు కోసం రోడ్డెక్కారు. మా త్యాగాన్ని వృధా చేస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రోజుకో రకం నిరసనతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో అమరావతిలో పూర్తస్థాయి రాజధాని కాకుండా ప్రభుత్వానికి సంచలన ప్రతిపాదనలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అమరావతిని స్పెషల్ అగ్రికల్చరల్ జోన్‌గా మార్చి రైతుల్ని భాగస్వామ్యం చేయలని నిపుణులు ప్రతిపాదిస్తున్నారట. ఈ ప్రాంతాన్ని స్పెషల్ అగ్రికల్చరల్ జోన్‌ పరిధిలోకి తీసుకురావడం వలన రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చెయ్యవచ్చని నిపుణులు సూచించినట్లు తెలుస్తోంది. రిటర్నబుల్ ప్లాట్లను రైతులకు, మిగిలిన భూముల్ని ఎస్ఏజెడ్(స్పెషల్ అగ్రికల్చరల్ జోన్‌) పరిధిలోకి తెచ్చేలా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎస్ఏజెడ్ ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ల్యాండ్ పూలింగ్‌ లో తీసుకున్న రైతుల భూముల తోపాటూ ప్రభుత్వ భూముల్ని ఎస్ఏజెడ్ పరిధిలోకి తెచ్చేలా వ్యవసాయ నిపుణులు ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనల్లో ముఖ్యంగా రాజధాని కోసమని కొన్ని భూముల్లో వేసిన రోడ్లను, నిర్మించిన కొన్ని భవనాలను యధాతథంగా ఉంచాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన భూమిని ప్రత్యేక వ్యవసాయ జోన్‌గా పరిగణించి.. విలువైన పంటలకు హబ్‌గా అమరావతిని అభివృద్ధి చెయ్యాలని సూచించారట. ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థికమండళ్లలో పురోగతిని పరిశీలించి నిపుణులు తగిన నివేదిక కూడా ఇచ్చారని ఈ ప్రతిపాదనలపై జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమరావతి వ్యవసాయ జోన్‌గా మారే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో భవిశ్యత్ లో ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News