బాబుకు ఇల్లు కొనుక్కునే స్తోమత లేదా? ఇంటి స్థలం నేను ఇస్తాను: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సెటైర్లు

Update: 2019-07-07 11:07 GMT

అమరావతిలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిపై లింగమనేని రమేష్ గతంలో చేసిన వ్యాఖ్యలను సరిచూసుకోవాలన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. కరకట్టపై ఉన్న ఇళ్లు భూసమీకరణలో ప్రభుత్వానికి ఇచ్చానని చెప్పిన లింగమనేని ఇప్పుడు మాటమార్చి ఆ ఇల్లు తనదేని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తాను నివాసం ఉంటున్న ఇళ్లు ప్రభుత్వానికేదనంటూ అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు సీఎం పదవి పోయాకా ప్రభుత్వ ఇళ్లు ఖాళీ చేయడం లేదని మండిపడ్డారు. సీఆర్డీఎ నోటీసులపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్లుగా దోచిన సంపదను ఆ ఇంట్లోనే ఏమన్నా దాచిపెట్టారా? ఈ ఇంటిని చంద్రబాబుకు బలవంతంగా లింగమనేని ఇస్తే, ఆ విషయాన్ని ఆయన చెప్పాలని వ్యాఖ్యానించారు. ఎంతటి వారైనా సరే, అక్రమనిర్మాణాలు ఉంటే చర్యలు తీసుకుంటామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆర్కే స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఇల్లు కొనుక్కొనే స్తోమత లేకపోతే, ఇంటి నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని తాను ఇస్తానంటూ సెటైర్లు విసిరారు.

Tags:    

Similar News