సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా ప్రభుత్వం పనిచేస్తోంది : జనసేన ఎమ్మెల్యే

Update: 2020-01-04 03:07 GMT

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహార తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఒకవైపు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ తీరుపై విరుచుకుపడుతుంటే.. రాపాక మాత్రం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అవకాశం దొరికితే వైసీపీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తే రాపాక వరప్రసాద్ మరోసారి సానుకూలత ప్రదర్శించారు.సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా ప్రభుత్వం పనిచేస్తోందన ఇప్పటివరకూ చేసినా, చేపట్టిన ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడేవి.. ఈ విషయంలో ముఖ్యమంత్రిని అభినందించాల్సిందే అని అన్నారు.. మూడు రాజధానుల నిర్ణయం సబబే అని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు.
మంచిచేస్తే ప్రభుత్వానికి మద్దతిస్తాం అని చెప్పారు. దీంతో జనసేనలో ఆయన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదంగా మారాయి.

ఎవరిని అడగకుండా, పార్టీ లైన్ దాటి సొంత ప్రయోజనాలకోసం మాట్లాడుతున్నారని రాపాకపై జనసేన నేతలు మండిపడుతున్నారు.  ప్రభుత్వం తప్పుడు మార్గంలో వెళుతోందని విమర్శల దాడి చేస్తున్న పవన్ కళ్యాణ్ కు బిన్నంగా రాపాక మాట్లాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయనపై వేటు వేస్తే పార్టీకున్న ఒక్క ఎమ్మెల్యేనూ చేజేతులా చేజార్చుకున్నామన్న అపవాదు వస్తుందేమోనని రాపాకను చూసి చూడనట్టు వదిలేస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యే రాపాక కూడా జనసేనలో సీరియస్ నెస్ లేదని.. మారకుంటే భవిశ్యత్ లో పార్టీ బ్రతకడం కష్టమేనని గతంలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ఇప్పటికీ మంటపుట్టిస్తున్నాయి. 

Tags:    

Similar News