ACB: దుర్గగుడి సూపరింటెండెంట్ ఆస్తులపై ఏసీబీ తనిఖీలు
ACB: రూ.17.91 లక్షల నగదు, 209 గ్రాముల బంగారం సీజ్
ACB: దుర్గగుడి సూపరింటెండెంట్ ఆస్తులపై ఏసీబీ తనిఖీలు
ACB: విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వాసా నగేశ్ ఏసీబీ వలకు చిక్కుకున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదుతో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. వాసా నగేశ్ నివాసంతోపాటు సంబంధీకుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
వాసా నగశ్ ఇంట్లో 17లక్షల91వేల రుపాయల నగదు, 209 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ బహిరంగ మార్కెట్‌లో విలువ 13 లక్షలుంటుందని ఎసీబీ అధికారులు అంచనా వేశారు. ద్వారకాతిరుమలలో జీ+4 ఇల్లు, ఓ కారును తాడేపల్లి గూడెంతో పాటు జంగారెడ్డి గూడెం, నిడదవోలు పట్టణాల్లో ఇళ్లున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.