Chittoor: దళితుడిని ప్రేమించిందని కూతురిని చంపిన తండ్రి

Chittoor: విషయం తెలిసి రైలు కిందపడి ప్రియుడు గంగాధర్ ఆత్మహత్య

Update: 2023-06-29 03:31 GMT

Chittoor: దళితుడిని ప్రేమించిందని కూతురిని చంపిన తండ్రి

Chittoor: చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో పరువు హత్య కలకలం రేపింది. దళితుడిని ప్రేమించిందని ఆగ్రహించిన తండ్రి.. కన్న కూతురుని హత్య చేశాడు. కూతురు కీర్తిని గొంతుకోసి చంపేశాడు తండ్రి కృష్ణమూర్తి. అయితే ప్రియురాలిని హత్య చేశారని తెలుసుకున్న ప్రియుడు గంగాధర్.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో యువతి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా బంగారుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Tags:    

Similar News