Coronavirus: ఏపీలో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్ కేసులు..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 14కు చేరింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరింది. మరో 35 మంది బాధితులు డిశార్చ్ అయ్యారు. ప్రస్తుతం 517 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ కర్నూలు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 4, చిత్తూరు 5, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు 6, కడపలో 1, కృష్ణా జిల్లాలో కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో జిలాల వారిగా పాజిటివ్ కేసులు పరిశీలిస్తే గుంటూరు జిల్లాలో అత్యధికంగా 126 కేసులు నమోదయ్యాయి, కర్నూలు (126,), కృష్ణ(52), కడప(37), నెల్లూరు(64), ప్రకాశం(42), పశ్చిమ గోదావరి(34), చిత్తూరు(28), అనంతపూరం(26), విశాఖపట్నం(20), తూర్పు గోదావరి(17) జిల్లాలు ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కోవిడ్ ఫ్రీ జిల్లాలుగా ఉన్నాయి