Coronavirus: షాకింగ్.. ఏపీలో 14 మంది మృతుల్లో.. 13 మంది వారే..

కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చింది. గురువారం వరకు రాష్ట్రంలో మొత్తం 534 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, వాటిలో మరణించారు.

Update: 2020-04-17 04:47 GMT
Representational Image

కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చింది. గురువారం వరకు రాష్ట్రంలో మొత్తం 534 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, వాటిలో మరణించారు. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి ఏపీలో 14 మంది చనిపోగా.. అందులో 13 మంది పురుషులే ఉన్నారు. 50 ఏళ్లు దాటిన వారిలో 12 మంది చనిపోయారు. వీరిలో 50- 60 ఏళ్ల మధ్య వయసువారు ఎనిమిది మంది ఉండటం గమనార్హం. రాష్ట్రంలో తొలి మరణం మార్చి 30న నమోదైంది. మృతుల్లో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు.

కరోనా బారినపడి మృతిచెందిన వారిలో ఎక్కువగా దీర్ఘకాలిక అనారోగ్య కారణాలు ఉన్నవారు.. ఎక్కువ మందికి మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమా వంటి సమస్యలూ ఉన్నాయి. నలుగురు తీవ్ర ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ మరణించారు. తర్వాత వారికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. మృతుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు, కృష్ణా జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు.అనంతపురం 2, కర్నూలు 2, నెల్లూరు జిల్లాల్లో 2 మరణించారు.

నెల్లూరు జిల్లాలో చనిపోయిన ఇద్దరిలో ఒకరు వైద్యుడు ఉన్నాడు. వారంతా ఢిల్లీ నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉండడం వల్లే చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు చనిపోగా వారిలో ఒకరు వైద్యుడు. అనంతపురంలో కరోనా బారిన పడి మరణించిన వారిలో ఇద్దరిలో ఒకరు ఢిల్లీ నుంచి వచ్చినవారు.

ఆ వ్యక్తి ఆస్పత్రిలో పక్క వార్డులో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న వ్యక్తికీ వైరస్‌ సోకింది. దీంతో ఇద్దరు చనిపోయారు గుంటూరు, కృష్ణ జిల్లా లో మరణించనవారు ఢిల్లీ లింకులు వున్నవారే కావడం గమనార్హం. కృష్ణ జిల్లాకు చెందిన వారిలో 74 ఏళ్ల మహిళ ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరి మరణించారు. కరోనా పరీక్షలో పాజిటివ్ తేలింది. 

Tags:    

Similar News