పేలిన 108 వాహనం టైర్

మండలంలో ఆపదలో ఉన్న వారిని రక్షించే 108 వాహనానికి అవస్థలు వచ్చాయి.

Update: 2019-12-22 04:50 GMT

మర్రిపాడు: మండలంలో ఆపదలో ఉన్న వారిని రక్షించే 108 వాహనానికి అవస్థలు వచ్చాయి. మర్రిపాడు మండలం నాగరాజుపాడులో ఆపదలో ఉన్న వారిని తీసుకెళ్లేందుకు వెళుతుండగా టైరు పేలిపోవడంతో మార్గమధ్యంలో ఆగిపోయింది. మర్రిపాడు 108 వాహనం టైరు పేళ్లిందని బాధితులకు తెలిపి దుత్తలూరు 108 వాహనానికి సమాచారం అందించామని తెలిపారు. ఆ వాహనం రాని ఎడల ఏదైనా ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అందుబాటులో ఉన్న దుత్తలూరు 108 వాహనం రావడంతో క్షతగాత్రులు ఉదయగిరి ఏరియా ఆస్పత్రి తరలించినట్లు మర్రిపాడు 108 సిబ్బంది తెలిపారు.

గత కొద్ది నెలలుగా నిర్వహణ వ్యయానికి నోచుకో టైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం అందించిన అధికారులు స్పందించక పోవడంతో అర్ధరాత్రి అడివిమార్గ మద్యలో 108 సిబ్బందికి అగచాట్లు తప్పటం లేదని 108 సిబ్బంది వాపోతున్నారు. సంబంధిత అధికారులు 108 వాహనలకు మైంట్నెస్ విస్మరించడం తో ఈ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి 108 వాహనాలకు సరైన మైంట్నెస్ కల్పించాలని కోరుతన్నారు. 

Tags:    

Similar News