జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం టూర్ క్యాన్సిల్?

Update: 2019-03-30 02:49 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం టూర్ ఆఖరి నిమిషంలో రద్దయినట్టు తెలుస్తోంది. ఇవాళ జిల్లాలో సీఎం చంద్రబాబు టూర్ నేపథ్యంలో.. పవన్‌ హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతివ్వలేదు. దీంతో పవన్ మరో జిల్లాలో ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం ఆయన రాయలసీమలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే జిల్లాలో జల అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు. రైతులకు జనసేన అండగా ఉంటుందని చెప్పారు.

రాయలసీమ బతుకు చిత్రాన్ని మార్చేలా 50 వేల కోట్ల నిధులతో సౌభాగ్య రాయలసీమను అమలు చేస్తామన్నారు. ఆదోని భూకబ్జాలను అడ్డుకుంటామన్నారు. సాగు, తాగు నీటి కోసం రాయలసీమకు వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తనను టీడీపీ పార్ట్ నర్ అన్న వైసీపీ ఆరోపణలను ఆయన ఖండించారు. ఇక ప్రతిపక్షనేత వైయస్ జగన్ పై విమర్శలు సంధించారు. రాయలసీమ కోసం జగన్ చేసిందేమి లేదని ఆరోపించారు. కాగా పవన్ సభ సందర్బంగా అపశృతి చోటుచేసుకుంది. మైక్ సెట్ తల మీద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. 

Similar News