అనాధ పిల్లలను ఆదుకోవడం లోనే తృప్తి

అనాధ పిల్లలను ఆదుకోవడం లోనే చక్కని ఆనందం లభిస్తుందని అంటున్నారు ఆ యువకులు.

Update: 2019-09-11 13:35 GMT

డుంబ్రిగుడ: అనాధ పిల్లలను ఆదుకోవడం లోనే సంతృప్తిగా ఉందని హోప్‌ గివెన్‌ సోషల్‌ సర్వీస్‌ బృందం సభ్యులు అన్నారు. జైపూర్‌ జంక్షన్‌ రైల్వే గేట్‌ కు మధ్యన ఉన్న ప్రత్యూష అనాధాశ్రమం రేషన్‌ సరుకులు అందజేశారు. అక్కడ ఉన్న సుమారు 75 మంది బాలికలకు బట్టలను అందజేశారు. ఈ సందర్భంగా హోప్‌ గివింగ్‌ సోషల్‌ సర్వీస్‌ బృంద సభ్యురాలు ఎస్టర్‌ సోనీ మాట్లాడుతూ తాము 70 మంది ఒక బృందంగా ఏర్పడి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఒక పత్రికలో తమ గురించి ప్రచురితమైన ఆర్టికల్‌ చూసి ఇక్కడ అరకు సమీపంలో ఉన్న వెంకటరమణ ఫోన్‌ లో సంప్రదించి అనాధ శరణాలయం పరిస్థితి అవసరాల గురించి వివరించారు. దీంతో సుమారు పది రోజుల పాటు పలు కళాశాలలకు వెళ్లి కొంత నిధులు రాబట్టి ఎక్కడ చిన్నారుల కోసం బట్టలు సైతం సహకరించాలన్నారు. 

Tags:    

Similar News