ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Update: 2019-07-06 09:58 GMT

ఏపీ ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచుతూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక తొలి క్యాబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని 27 శాతం మేర మధ్యంతర భృతి పెంపుదల చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. కాగా ఈ పెంపు ఈ జూలై మాసం నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. మొత్తానికి ఏపీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టకా పాలనను పరుగులు పెట్టిస్తున్నారు సీఎం జగన్.

Similar News