జేఈఈ, నీట్‌ మాక్ టెస్టుల కోసం యాప్.. జులై మొదటి వారంలో హాల్‌టికెట్లు..!

జేఈఈ, నీట్‌ మాక్ టెస్టుల కోసం యాప్.. జులై మొదటి వారంలో హాల్‌టికెట్లు..!
x
Highlights

జేఈఈ, నీట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదరుక్కోకూడదనే ఉద్దేశంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఆన్‌లైన్ పరీక్షలను ప్రాక్టీస్ చేసుకునేందుకు మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

జేఈఈ, నీట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదరుక్కోకూడదనే ఉద్దేశంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఆన్‌లైన్ పరీక్షలను ప్రాక్టీస్ చేసుకునేందుకు మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని కోసం నేషనల్ టెస్ట్ అభ్యాస్ పేరుతో ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులో ఉంచింది. ఈ యాప్ ను అభ్యర్ధులు మొబైన్ ప్లే స్టర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని విజయవంతంగా టెస్టులను రాసుకోవచ్చిన తెలిపింది. అంతే కాకుండా ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ https://nta.ac.in/abhyas లో కూడా విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని వివరించింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వారు జులై 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ హాల్ టికెట్లను జూలై మొదటి వారంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది. జూలై 26వ తేదీన నిర్వహించనున్న నీట్ హాల్‌టికెట్లను కూడా 15 రోజుల ముందుగా వెబ్‌సైట్ అందుబాటులో ఉంచుతామని తెలిపింది. పరీక్షలు నిర్వహించే నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో షిప్ట్ పరీక్ష ఉంటుందని పేర్కొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories