Top
logo

Viral Video: 4 భారీ కూలింగ్ టవర్లు.. సెకన్ల వ్యవధిలో కూల్చివేత!

Cooling Towers Demolished in Seconds
X

కూలింగ్ టవర్ల కూల్చివేత (ఫొటో యూట్యూబ్)

Highlights

Viral Video: నాలుగు భారీ కూలింగ్ టవర్లు ఒక్కదెబ్బతో కూలిపోయాయి. దుమ్ము, పొగను చిమ్ముతూ చిన్న ముక్కలుగా అయిపోయాయి.

Viral Video: నాలుగు భారీ కూలింగ్ టవర్లు ఒక్కదెబ్బతో కూలిపోయాయి. దుమ్ము, పొగను చిమ్ముతూ చిన్న ముక్కలుగా అయిపోయాయి. రూగిలే పవర్‌ స్టేషన్‌లో జరిగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ పవర్‌ స్టేషన్ ఇంగ్లండ్‌లోని స్టాఫర్డ్‌షైర్‌లో ఉంది. 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌... 2016 నుంచి పనిచేయడం ఆగిపోయింది. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి, వ్యాపార సముదాయాల కోసం ఈ టవర్లను కూల్చారు. ఈ కూలింగ్ టవర్లు 117 మీటర్ల ఎత్తు ఉన్నాయి.

ఇంత ఎత్తైన టవర్ల కూల్చివేతను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు వచ్చారు. ఒకేసారి నాలుగు టవర్లను కూల్చివేసేందుకు కొన్ని నెలలపాలు ప్రిపేర్‌ అయ్యామని బ్రౌన్ అండ్ మాసన్ గ్రూప్ పేర్కొంది.

Web TitleCooling Towers Demolished in Seconds
Next Story