నేను నీకు రక్షా, నీవు నాకు రక్షా!

నేను నీకు రక్షా, నీవు నాకు రక్షా!
x
Highlights

పురుషోత్తముడు యుద్ధం గెలిచినా కూడా అలెగ్జాండర్‌ ని చంపకుండా విడిచిపెట్టడానికి కారణం ఒక రాఖి, శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతే, శ్రీమహాలక్ష్మి తన భర్తను వైకుంఠానికి తీసుకురావటానికి సహాయపడింది ఒక రాఖీ. అలాంటి శక్తి వంతమైన రాఖీ పండుగ ఈ రోజు.

పురుషోత్తముడు యుద్ధం గెలిచినా కూడా అలెగ్జాండర్‌ ని చంపకుండా విడిచిపెట్టడానికి కారణం ఒక రాఖి, శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతే, శ్రీమహాలక్ష్మి తన భర్తను వైకుంఠానికి తీసుకురావటానికి సహాయపడింది ఒక రాఖీ. అలాంటి శక్తి వంతమైన రాఖీ పండుగ ఈ రోజు. దీనినే మనం రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలుస్తాము. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. దేశమంతా ఈ పండుగను ఆనందోత్సవాలతో ఈ రోజు జరుపుకుంటారు. తమ అన్నకు గాని, తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే అందమైన చేతి బంధాన్ని కట్టటం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య, అక్క తన తమ్ముడు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే ఈ రాఖీ. అందరికి రాఖీ పండగ శుభాకాంక్షలు.

Show Full Article
Print Article
Next Story
More Stories