అమృతం కురిసిన రాత్రి....తిలక్ పుట్టిన రోజు

అమృతం కురిసిన రాత్రి....తిలక్ పుట్టిన రోజు
x
Highlights

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు....అంటూ తన కవితా అమృతం పంచిన కవి పుట్టినరోజు ఈ రోజు......అందమైన, అర్ధవంతమైన కవి, భావ కవులలో అభ్యుదయ...

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు....అంటూ తన కవితా అమృతం పంచిన కవి పుట్టినరోజు ఈ రోజు......అందమైన, అర్ధవంతమైన కవి, భావ కవులలో అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్ . ఇతను కవి, కథకుడు, నాటక కర్త కూడా. తిలక్ అమృతం కురిసిన రాత్రి... ఒక ప్రసిద్ధ తెలుగు కవితా సంపుటి. ఈ రచన ఎందరో పాఠకులకు, పలు రచయితలకు సైతం ఇష్టమైన కవితా సంకలనం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన ఈ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న తిలక్ జన్మించాడు. ఆయన మన మద్య లేకున్నా కూడా ఆయన కవిత్వం, భావాలూ తెలుగు వారి గుండెల్లో ఎప్పుడు వుంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories