ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం!

ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం!
x
Highlights

ఈ మద్య వచ్చిన మల్లేశం సినిమా మీరు చూసివుంటే, ఒకప్పుడు చేనేత కార్మికుల జీవితాలు ఎలా వుండేవో మనకు తెలుస్తుంది. వారి శ్రమకు ఫలితం దక్కాలనే ఉద్దేశంతో...

ఈ మద్య వచ్చిన మల్లేశం సినిమా మీరు చూసివుంటే, ఒకప్పుడు చేనేత కార్మికుల జీవితాలు ఎలా వుండేవో మనకు తెలుస్తుంది. వారి శ్రమకు ఫలితం దక్కాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ రోజు 5 వ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని వివిధ రాష్ట్రాల్లోని చేనేత సేవా కేంద్రాల్లో జరుపుకుంటారు. ముఖ్యంగా దేశంలోని చేనేత చేనేత కార్మికులను గౌరవించటానికి మరియు భారతదేశం యొక్క చేనేత పరిశ్రమను అభివృద్ధి పరచటానికి ఏటా ఆగస్టు 7 న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఇది దేశ సామాజిక ఆర్థికాభివృద్ధికి చేనేత సహకారంపై దృష్టి పెట్టాలని మరియు నేత కార్మికుల ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనకు నిరసనగా 1905 లో కలకత్తా టౌన్ హాల్‌లో ఈ రోజు ప్రారంభించిన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఆగస్టు 7 తేదీని జాతీయ చేనేత దినంగా ఎంచుకున్నారు. ఈ ఉద్యమం దేశీయ ఉత్పత్తులు మరియు ఉత్పత్తి ప్రక్రియలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. మీరు కూడా వీలైనంత వరకు చేనేత బట్టలను వాడండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories