పద్మభూషణ్ చిరంజీవి పుట్టినరోజు ఈ రోజు.

పద్మభూషణ్ చిరంజీవి పుట్టినరోజు ఈ రోజు.
x
Highlights

పునాది రాళ్ల తో తన సిని జీవితాన్ని నిర్మించుకొని, అభిమానుల గుండెల్లో ఖైది అయిన, మన జగదేకవీరుని పుట్టిన రోజు ఈ రోజు. పునాది రాళ్ళలో నటించిన కూడా మన చిరంజీవి యొక్క ప్రాణం ఖరీదు సినిమా ముందుగా విడుదల అయ్యింది.

పునాది రాళ్ల తో తన సిని జీవితాన్ని నిర్మించుకొని, అభిమానుల గుండెల్లో ఖైది అయిన, మన జగదేకవీరుని పుట్టిన రోజు ఈ రోజు. పునాది రాళ్ళలో నటించిన కూడా మన చిరంజీవి యొక్క ప్రాణం ఖరీదు సినిమా ముందుగా విడుదల అయ్యింది. అలా చిరంజీవికి ముట్టిన మొదటి పారితోషికం 1,116 రూపాయలు అని మీకు తెలుసా! ఆ తర్వాత మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో విభిన్న పాత్రలు పోషించి అందరిని మెప్పించాడు. అయితే ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా తన సత్తా ఏంటో చూపెట్టాడు.

అలాగే చంటబ్బాయ్, ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ సినిమా తమ్ముని పాత్రలో చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు.తరువాత కొంతకాలం గ్యాప్ తీసుకున్నా కూడా ఖైదీ నెం.150 తో 2017 జనవరి 11 న విడుదల అయ్యి చిరు రీ ఎంట్రీ ఘనం గా సాగింది..ఇప్పడు అందరు ఎదురు చూస్తున్న సినిమా సైరా. ఈ పుట్టినరోజు చిరంజీవికి సైరా సందర్భంలో చాల ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories