కృష్ణాష్టమి – దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ!

కృష్ణాష్టమి – దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ!
x
Highlights

చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు, చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు... అని అందరు అనే రోజు ఈ రోజు. ఈ...

చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు, చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు... అని అందరు అనే రోజు ఈ రోజు. ఈ రోజు కృష్ణాష్టమి, అంటే! పెళ్లి పుస్తకం సినిమాలో ఒక పాత్ర చెప్పినట్టు... క్రిష్ణుని హ్యాపీ బర్త్ డే. నేడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రాం శ్రీకృష్ణుని పూజిస్తారు. ఈ మాసంలో లభించే పళ్ళు,అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.

అలాగే ఇంకా ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' అని పిలుస్తారు. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది దుష్టశిక్షణ, శిష్ట రక్షణ. అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తీసుకువస్తున్నాయి. ఈ కృష్ణాష్టమి మీ ఇంట్లో ఆనంద మురళి గానం యొక్క మాదుర్యం అందరికి అందాలని ఆశిస్తున్నాము.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories