స్వేచ్చాగీతికను స్వచ్చంగా భావితరాలకు అందిద్దాం!

స్వేచ్చాగీతికను స్వచ్చంగా భావితరాలకు అందిద్దాం!
x
Highlights

రెండు శతాబ్దాల బానిసత్వం.. త్యాగధనుల పోరు ఫలితం.. స్వేచ్చా గీతికతో మువ్వన్నెల స్వాతంత్ర్య భారతం. చరిత్ర తలుచుకుని.. వర్తమానాన్ని కొలుచుకుని..భవిష్యత్ కు బాట వేసుకోవాల్సిన సమయం.

రెండు శతాబ్దాల బానిసత్వం.. త్యాగధనుల పోరు ఫలితం.. స్వేచ్చా గీతికతో మువ్వన్నెల స్వాతంత్ర్య భారతం. చరిత్ర తలుచుకుని.. వర్తమానాన్ని కొలుచుకుని..భవిష్యత్ బాట వేసుకోవాల్సిన సమయం. ప్రజాతంత్ర రాజ్యంగా ప్రపంచం లోనే ఆదర్శవంతమైన దేశం మనది. వేగంగా అభివృద్దివైపు దూసుకుపోతున్న రాజ్యం మనది. కులమతాల కుత్సితాలు వరుస దాడులు చేస్తున్నా.. రాజకీయ క్రీడల క్రీనీడలో బతుకులు బరువవుతున్నా.. ప్రజాస్వామ్యపు పటిష్ట పునాదుల మీద జనభారతం సగర్వంగా జనగణమన అంటూ ఘన గీతికను విశ్వవ్యాప్తంగా విరాజిల్లెలా చేస్తోంది. చంద్రుని అందుకునే ఉత్సాహం.. ఉన్మాద దాడుల్ని తిప్పికొట్టే వీరుల సాహసం.. ఓటెత్తి సవ్య పాలకుల్ని ఎన్నుకోగలిగే జన బాహుళ్యం.. తమదైన మార్కును ప్రపంచ చిత్రపటంపై ఆవిష్కరిస్తున్న యువజన ఘనం.. నవభారతావనికి నవ్య సిందూరాన్ని దిద్దుతున్నాయి.

స్వాతంత్ర్యం .. ఒక్కరోజు చేసుకునే పండుగ కాదు. స్వేచ్చ పిచ్చితనపు వేదిక కాదు. త్యాగాల పూమాలను అఖండ భారతానికి అలంకరించిన మహనీయుల కృషిఫలితం. ఆ దేదీప్య స్ఫూర్తికి మనమిచ్చే ఘన నివాళి స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో మనం సాధించిన విజయాలు.. దిగమింగిన పరాజయాలు.. అన్నిటినీ ఒక్కసారి మనననం చేసుకుని నవ భారత నిర్మాణంలో నేను సైతం అంటూ ప్రతి పౌరుడూ ప్రతిన పూనాల్సిన సమయం ఇది. స్వర్ణ భారతానికి పూల రహదారిని వేసేందుకు సమిష్టిగా చేతులు కలపాల్సిన తరుణం ఇది. పరాయిపాలన మీద ఎక్కుపెట్టిన మహాత్ముని అహింసాయుదాన్ని అఖండ భారతావనిని ఆదర్శ భారతంగా నిలపడానికి వినియోగించుకుని.. రాబోయే తరాలకు స్వర్గతుల్య భారతాన్ని అందించే దిశలో ముందుకు సాగుదాం.

స్వతంత్ర సముపార్జన కోసం మన యోధులు ఆరోజు చేసిన పోరును.. నవ సమాజంలో పెనవేసుకుపోతున్న దుర్నీతి పై చేయాల్సిన అవసరం ఉంది. ఆ మహానుభావులు ఇచ్చిన స్వతంత్ర భారతాన్ని అంతే స్వచ్చంగా మన భావి తరాలకు అందించాల్సిన బాధ్యతమనదే!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories