హ్యారీ పోటర్ సృష్టికర్త పుట్టినరోజు ఈ రోజు

హ్యారీ పోటర్ సృష్టికర్త పుట్టినరోజు ఈ రోజు
x
Highlights

ఈ రోజుల్లో హ్యారీ పోటర్ సినిమా చూడని పిల్లలు లేదా పుస్తకం చదవని పిల్లలు తక్కువే వుంటారు. ఆ కథ సృష్టించిన వ్యక్తి పుట్టిన రోజు...ఈ రోజు. ఆవిడే బ్రిటిష్...

ఈ రోజుల్లో హ్యారీ పోటర్ సినిమా చూడని పిల్లలు లేదా పుస్తకం చదవని పిల్లలు తక్కువే వుంటారు. ఆ కథ సృష్టించిన వ్యక్తి పుట్టిన రోజు...ఈ రోజు. ఆవిడే బ్రిటిష్ రచయిత్రి జే.కే రౌలింగ్. ఈవిడ రచించిన ఏడుకాల్పనిక పుస్తకాలే హ్యారీ పోటర్ నవలలు. ఈ పుస్తకాలు,యువ మాంత్రికుడైన హ్యారీ పోటర్, రాన్ వీస్లె మరియు హెర్మైనీ గ్రేంజర్ లతో,హోగ్వార్డ్స్ స్కూల్ అఫ్ విచ్ క్రాఫ్ట్ అండ్ విజార్డ్రిలో తన స్నేహితులతో కలిసి చేసిన సాహసాల గురించిన కథలు చెపుతాయి. దీనిలో ముఖ్య కథాంశం,మాంత్రిక లోకం అంతటిని జయించి మరియు మాయలు తెలియని ప్రజలని తన వశం చేసుకోవాలనే తపనతో హ్యారీ తల్లితండ్రులను చంపిన లార్డ్ వోల్డేమోర్ట్ అనే దుష్ట మాంత్రికుడితో హ్యారీ జరిపిన పోరాటానికి సంబంధించింది. ఈ పుస్తకాల క్రమం ఆధారంగా చాలా విజయవంతమైన చిత్రాలు, వీడియో ఆటలు మరియు వాణిజ్య వస్తువులు వచ్చాయి. మొదటి నవల 1997 లో విడుదలైనప్పటి నుంచి ఆ పుస్తకాలు ప్రపంచమంతట బహుళ ప్రాచుర్యాన్ని, ప్రశంశలను మరియు వాణిజ్య పరమైన విజయాన్ని సాధించాయి. ఈ పుస్తకాలూ 67 భాషలలో అనువదించబడ్డాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories