మన సి.నా.రె. పుట్టినరోజు ఈ రోజు.

మన సి.నా.రె. పుట్టినరోజు ఈ రోజు.
x
Highlights

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని...అని ఎన్నో పాటలు..మాటలు..కవితలు రాసిన గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. మన సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన...

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని...అని ఎన్నో పాటలు..మాటలు..కవితలు రాసిన గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. మన సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి పుట్టిన రోజు ఈ రోజు. మన సి.నా.రె తెలుగు కవి, సాహితీవేత్త. సి.నారాయణరెడ్డి 1931, జూలై 29 న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేట్లో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు.

హైదరాబాదు లోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. వటపత్రశాయికి వరహాల లాలి అని ఆయన రాసిన పాట ఇప్పటికి ఎంతో మంది తల్లులు వారి పిల్లల కోసం పాడుతూనేవున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories