Top
logo

ఏపీ గవర్నర్ విశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ జన్మదినం నేడు

ఏపీ గవర్నర్ విశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ జన్మదినం నేడు
Highlights

ఏపీ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తొలిసారిగా ఏపీ రాజ్‌భవన్‌లో తన 85వ పుట్టిన రోజు వేడుకలు...

ఏపీ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తొలిసారిగా ఏపీ రాజ్‌భవన్‌లో తన 85వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు. గిరిజన, దళిత చిన్నారుల మధ్య జరిగే ఈ వేడుకలకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయాన్నే ఆయనకు తిరుమల తిరుపతి, కనకదుర్గమ్మ దేవస్థానాల వేదపండితులు ఆశీర్వచనం ఇస్తారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి, చిన్నారులందరికీ నూతన వస్ర్తాలు, నోట్‌ పుస్తకాలు పంపిణీ చేస్తారు. సీఎం జగన్‌ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు మంత్రి కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు. చివరగా ఆంధ్రా లయోలా కళాశాలలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, మొక్కలు నాటుతారు.

Next Story